ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
- *హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలి.*
- *కార్మికుల పట్ల కొంత మంది సూపర్వైజర్లు వేధింపులు అరికట్టాలి.*
- *పీఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలి.*
- *ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.*
కరీంనగర్ జిల్లాలోని *హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఈ రోజు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్ (టియుసిసి) సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.*
ఈ సందర్బంగా ట్రేడ్ యూనియన్ కో -ఆర్డినేషన్ (టియుసిసి) జాతీయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి షానిటేషన్ పెసెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని అన్నారు. ఆసుపత్రి సూపర్డెంట్, ఆర్ ఎమ్ లకు జీతాలు గురించి ఫోన్ లో మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని విమర్శించారు.
కార్మికులతో మాత్రం వెట్టిచాకిరీ చేపించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులు డ్యూటీకి ఒక్క 15 నిముషాలు లెట్ గా వస్తే పని చేపించుకొని అప్సంట్ వేసి జీతం రు :500/-లు కట్ చేస్తున్నారని ఇదేక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కార్మికులకు నెలకు 11వేలు జీతం ఇస్తూ 500లు ఇలా కట్ చేస్తారని ప్రశ్నించారు. వైద్య అధికారులు స్పార్క్ కాంట్రాక్టర్ సంస్థ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రతి నెల 5 నుండి 10వ తేదీ కల్లా కార్మికుల జీతాలు వేస్తామని ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం నాలుగు నెలలఫ్యామిలీ జీతాలు వేయడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వ హాస్పటల్ సూపర్వైజర్లు కార్మికులను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కార్మికులను వేధింపులకు గురి చేసిన సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల పీఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జామచ్చేయాలని డిమాండ్ చేసారు. ఈస్ఐ సౌకర్యం కలిపించాలని అన్నారు. కార్మికులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగం భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈ సమ్మెలో ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ హాస్పిటల్ నాయకులు జగన్, రాజయ్య, సదానందం, చంద్రమౌళి, స్వరూప, అనిత, హేమలత, రాధా, శ్యామల తదితర కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment