భద్రాద్రిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
భద్రాద్రిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి జిల్లా కేంద్రం, లక్ష్మిదేవిపల్లి మండలం & గ్రామం, లోతువాగు గ్రామం కొమరం భీం కాలనిలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం AEWCA ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి.
ప్రపంచ వ్యాపితంగా అంతరించి పోతున్న తెగలలో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం కాకూడదనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1994లో ,తిర్మణించారని, ప్రస్తుత నాగరిక ప్రపంచానికి ఆదివాసిలే మూలాదారమని, భారత రాజ్యాంగంలో కల్పించిన ఆదివాసీల హక్కులను, సంస్కృతి, సాంప్రదాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడడానికి చిత్తశుద్దితో పనిచేయాలని డిమాండ్ చేశారు,
భవిష్యత్తులో ఆదివాసీలు ఐక్యంగా తమహక్కులకై త్యాగశీలి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని వక్తలు కోరారు.
ఈ కార్యక్రమంలో JAC నాయకులు పూణెo శ్రీనివాస్, తాటి పద్మ, AEWCA ఉద్యోగ సంఘం నాయకులు తొలెం వెంకటేశ్వర్లు, ముడిగా ఎర్రయ్య, మల్కం సాములు, దొడ్డ రామ్మూర్తి, మేకల లక్ష్మినారాయణ, రావుల నర్సయ్య, పెండకట్ల ప్రసాద్, ఎట్టి లక్ష్మినారాయణ, చింత రాములు, కోరం కనకయ్య, చింత సర్వయ్య, మేకల ఉపేందర్, పాయం అందరావ్, పూణెo నరసయ్య, కుంజ బిక్ష్మం, జజ్జర లింగేశ్వరావు, మాడే బుచ్చయ్య, పాయం రాంబాబు, వాసం రాంబాబు, సత్యనారాయణ, అమృత, పద్మ, వెంకటలక్ష్మి, రాములమ్మ,
సుజాత, సీత, జయంతి, సరూప, స్వర్ణలత, కొమరం భీమ్ యువసేన నాయకులు తాటి తిరుమల్, తాటి అనిత, చింత నాగమణి, గుర్రం నరేష్, పూణెo. వెంకటేష్, తాటి విజయ్, విరకుమార్, శ్రీకాంత్, చింత.వెంకట్, సూరిబాబు, మహేష్, సారయ్య, నగేష్, సంతోష్, పెద్దురాజు, ప్రవీణ్, పప్పు, రాజేష్, భక్కులు, చీమల.రాము, సారథి తదితరలు పాల్గొన్నారు.

Post a Comment