-->

ఒకే కాన్పులో నలుగురు శిశువులు ఎక్కడో తెలుసా?

ఒకే కాన్పులో నలుగురు శిశువులు ఎక్కడో తెలుసా?

 ఒకే కాన్పులో నలుగురు శిశువులు ఎక్కడో తెలుసా?

పాతబస్తీ కాలాపత్తర్‌కు చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు ఆడ, మరో ఇద్దరు మగ సంతానం. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. 

మెహదీపట్నంలోని మీనా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కాన్పు కోసం వెళ్లిన కాలాపత్తర్‌కు చెందిన గర్భిణికి డా.సాహిబా షకూర్, డా. ఇష్రత్, డా.రమణ ప్రియ వైద్య బృందం శస్త్ర చికిత్స చేసింది. 

ఆమెకు ఒకే కాన్పులో జన్మించిన నలుగురు సంతానంలో ఒక మగ శిశువు బరువు 1.17కిలోలు, మరో మగశిశువు బరువు1.2 కిలోలు, ఒక ఆడ శిశువు బరువు 1.06 కిలోలు, మరో ఆడ శిశువు బరువు 1.05 కిలోలు ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువులకు ఇంటెన్సివ్‌ కేర్‌ వార్డులో ఉంచి పీడియాట్రిషియన్‌ పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793