ఎంబీబీఎస్ ప్రవేశాల జీవోపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజనర్సింహ
ఎంబీబీఎస్ ప్రవేశాల జీవోపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్: వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టత ఇచ్చారు. జీవో 33తో స్థానిక విద్యార్థులు నష్టపోతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్పందించారు.
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధి 2017 జులై 5న అప్పటి భారాస ప్రభుత్వం జారీ చేసిన జీవో 114ని ప్రస్తావించిన మంత్రి.. ఆ జీవోలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనను జీవో 33లో కొనసాగించామని పేర్కొన్నారు.
అయితే, అదే జీవోలోని 6 నుంచి 12 వరకు కనీసం నాలుగేళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని మంత్రి స్పష్టం చేశారు. జీవో 114లోని ఈ నిబంధన ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో..
మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగా పరిగణించారని గుర్తు చేశారు. అయితే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో నిబంధనను కొనసాగించలేమని మంత్రి పేర్కొన్నారు.

Post a Comment