సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్ద హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్ద హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
హెచ్ఎంఎస్ ఏరియా బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కు వినతి పత్రం
తెలంగాణకు తలమానికమైనటువంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోలను సాకుగా చూపిస్తూ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినటువంటి సింగరేణి కంపెనీని మరియు తెలంగాణలో ఉన్న బొగ్గునిక్షపాలను ప్రైవేటు పరం చేసే విధంగా టెండర్లను ఏర్పాటు చేసి అందులో పాల్గొని బొగ్గు బ్లాక్ లను దక్కించుకొని మాత్రమే సింగరేణి ప్రొడక్షన్ ఉత్పత్తి చేయాలని నిబంధనలను తెరమీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యోగ కల్పనకు తలమానికమైనటువంటి సింగరేణి వ్యవస్థ మీద ఆంక్షలు విధించడం సరికాదు.
ఏదైతే జీవో లో ఉన్నటువంటి ఎం ఎం టి ఆర్ యాక్ట్ ను పరిగణలోకి తీసుకొని తెలంగాణలో గల బొగ్గునిక్షేపాలన్నిటిని సింగరేణి కంపెనీకి కేటాయించాలని కంపెనీలో పని చేసేటటువంటి ప్రైవేట్ ఎంప్లాయిలను కూడా పర్మినెంట్ చేయాలని ప్రతి సంవత్సరం ఐదు కొత్త బొగ్గు బావులను ఓపెన్ చేయాలని పరుగు పందెం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఏరియా బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం ఏరియా జిఎం కి మెమోరండం ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వేలంపాటను నిలుపుదల చేయాలని జిఎంను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, పూర్ణచందర్, గోవర్ధన్, మొగిలి, ఫహీమ్, శ్రీనివాస్, ఇస్మాయిల్, ప్రకాష్, అలీమ్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు ఏరియా బ్రాంచ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

Post a Comment