గొప్ప దార్శనీకుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 134వ జయంతి వేడుకలు
గొప్ప దార్శనీకుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 134వ జయంతి వేడుకలు
134వ జయంతి సందర్బంగా ఈ రోజు టెమ్రీస్ రామగుండం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ టెమ్రీస్ కౌన్సిలర్ -వైస్ ప్రెసిడెంట్ -జమాత్ ఇ ఇస్లామీ హింద్ వారు మట్లాడుతు,
నేటి తరానికి గొప్ప దార్శనికులు మౌలానా అబుల్ కలామ్ అజాద్. దేశ సమైక్యతను ఆకాంక్షించిన చేశ స్వాతంత్య్రయోధులలో తొలి స్థానంలో నిలిచే వ్యక్తి ఆయన. అంతేకాదు దేశ విభజనను వ్యతిరేకించిన వారిలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. దేశం ముక్కుల పదాన్ని మౌలానా జీర్ణించుకోలేక పోయారు. విభజన చర్చలు జరుగుతున్న సమయంలో మౌలానా అబుల్ కలామ్ విభజనను తీవ్రంగా ఖండించినం దుకు ఆయన ఎంతో వ్యతిరేకతనూ నాడు ఎదుర్కొన్నారు.
ఇంతటి మహాన్నో త వ్యక్తి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వ్యక్తిత్వం, ఆయన నాయకత్వ లక్షణాల గురించి ఒకసారి పరిశీలిద్దాము. మౌలానా అబుల్ కలామ్ అజాద్ ధార్మిక పండితులే కాదు స్వాతంత్య్ర సమర గొప్ప యోధులు, విద్యా వేత్త, చుట్టారు. సామాజిక చెడుగులపై తమ కలాన్ని ఎక్కుపెట్టేవారు. చరిత్ర, సాహిత్యం తదితర అంశాలు ఈ పత్రికలో అచ్చు అయ్యేవి. ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు ఉద్యమ స్ఫూర్తిని మారపోసివి. ప్రజల్లో చైతన్యం నింపేవి.
అజాద్కు గాంధీ, నెహ్రుల ప్రశంస ఆంగ్లేయుకు వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది స్వతంత్ర యోధులకు మౌలానా ప్రేరణగా నిలిచారు. ముస్లిమ్ యువతరానికి చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను గురించి చెప్పడంలో సఫలీకృతుయ్యారు. అప్పటి అలిండియా కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. మౌలానా అబుల్. కలామ్ ఆజాద్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నతశ్రేణికి చెందిన నాయకుడు. దేశ రాజకీయాల గురించి అధ్యయనం చేసే ప్రతీ ఒక్కరూ ఈ వాస్తవాన్ని తోసిపుచ్చలేరు.
అంటూ మహాత్మాగాంధీ మౌలానాను ప్రశంసిం చారు. పండిట్ జవహార్ లాల్ నెహ్రూ సైతం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ రాజకీయ పరిణితి గురించి ప్రశంసించకుండా ఉండలేకపోయారు. నేను చదివినన్ని రాజనీతిశాస్త్ర గ్రంధాలను మరెవ్వరూ చదవలేదనుకుంటాను. యూరప్ రాజనీతిశాస్త్రం గురించి సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం కూడా నాకు దక్కింది. రాజనీతి శాస్త్రంలో పూర్తి పట్టు సాధించాననుకునేవాడిని, యూరప్ నుంచి ఇండియా వచ్చాక మౌలానా అబుల్ కలామ్తో మాట్లాడు తుంటే రాజనీతిశాస్త్రంలో ఆయన నాకంటె ముందంజలో ఉన్నారని తెలిసింది.
స్త్రీ నిర్బంధాలకు బెదరలేదు... ఢిల్లీలోని జామియా మస్జిద్ ఆవరణలో ఆయన చేసే ప్రసంగాలు వినేందుకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేవారు. అల్ హిలాల్ పత్రికలో ఆయన మేధావి, పాత్రికేయులు, రచయిత, కవి ఇలా బహుముఖ ప్రజ్ఞా పాటవాలు ఆయనలో దాగున్నాయి. పాత్రికేయమైనా, విద్యారంగమైనా, అరబీ భాషా నైపుణ్యంలో నైనా, రాజకీయ రంగ గవరిజ్ఞానంలోనైనా, ఆర్థిక దంగమైనా ఇలా ప్రతీ రంగంలోనూ ఆయనది అందెవేసిన చేయి. ఆయన ఉపన్యాసాలు రచన లు ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఆయన సంకల్ప బలం, అనుకు న్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల, చిత్తశుద్ధి, క్లిష్ట పరిస్థితుల్లో స్థిరచిత్తాన్ని ప్రదర్శించడంలో మౌలానా అబుల్ కలామ్కు ఎవరూ సాటిరారు.
స్వాతం ప్ర్ర్యానంతరం తొట్టతొలిసారి అధికారంలోకి వచ్చిన నెహ్రూ ప్రభుత్వ కేబినెల్ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. , స్వాతంత్య్ర సంగ్రా మంలో కీలకపాత్ర పోషించిన వారిలో అజాద్ పేరు అగ్రశ్రేణి యోధుల జాబితాలో ఉంటుంది. మౌలానా అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్, 1888 లో పవిత్ర మక్కా నేలపై జన్మించారు. ఆయన బాల్యమంతా మక్కా, మదీనాలోనే గడిచింది.
ఈజిప్టు లోని జామియా అబ్జెర్లో ఉన్నత చదువులు చదివారు. అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన మౌలానా పద్నాలుగేళ్ల వయస్సులోనే ఫిరహ్ (ఇస్లామ్ ధర్మశాస్త్ర) గ్రంథాలన్నీ విపోసన పట్టారు. పదకొండేళ్ల వయస్సులోనే నెరంగ్ పత్రికను ప్రారంభించారు. పదిహేనేళ్ల వయస్సులో లిసాను సిద్ధే పేరుతో పత్రికను ప్రారంభించారు. 1912లో పూర్తి స్థాయిలో అల్ హిలాల్ పేరుతో పత్రికను నడిపారు. రాజకీయ, సామాజిక, సాహిత్య పరమైన శీర్షికలు అందులో వచ్చేవి. అకట్టుకునే ప్రసంగాలతో, తన రచనా నైపుణ్యంతో ప్రజలను ఉర్రూతలూగించేవారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేవారు. 20వ శతాబ్దపు గొప్ప రచయితగా వినుతికెక్కారు.
ఎన్నో పుస కాలను గ్రంథస్తం చేశారు. గుబారె ఖాతిర్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ లాంటి గ్రంథాలు ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. ఆయన ఖుర్ఆన్ ఉర్దూ వ్యాఖ్యాన గ్రంధం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఖుర్ఆన్, హదీసు, ఫికహ్ పరిజ్ఞానంపై అద్భుతమైన పట్టుసాధించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు ఖుర్ఆన్, హదీసు పరిజ్ఞానాన్ని జోడించి చక్కని పరిష్కారం చూపిస్తూ ఆయన వ్యాసాలు సాగేవి, మౌలానా జీవితంలోని సింహ భాగమంతా సాహిత్య కృషికోసం, దేశ స్వతంత్రం కోసమే వెచ్చించారు. హిందూ-ముస్లిముల ఐక్యతను పెంపొందించడమే క్ష్యంగా అట్టాలాల్ పత్రికను నడిపారు.
అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించడంతో పాటు ముద్రణాలయాన్ని స్వాతంత్ర్యోద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు మౌలానా ఆర్థికంగా కూడా జప్తు చేసుకోవడంతో అల్ ఐలాగ్ పేరుతో మరో ప్రతికకు శ్రీకారం చేయూతనందించేవారు. వితంతువులు, అనాథలకు నెలకు సరిపడా రాసిన వ్యాసాలు నిద్రమత్తులో జోగుతున్న ముస్లిమ్ సముదాయాన్ని మేల్కొలిపాయి. ఆనాటి ముస్లిములంతా చైతన్యవంతులయ్యారు. అంతా సమైక్యమయ్యారు. మౌలాదా రచనలు జీర్ణించుకోలేని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం జరిమానాలు విధించేది. ఎన్ని జరిమానాలు విధించినా మౌలానా బెదరలేదు.
భయపడలేదు. నిజాలను నిర్వీతిగా రాసేవారు. జరిమానాలు, బెదిరింపులు మౌలానాను రాయకుండా ఆపలేకపోయాయి. ప్రభుత్వం ఆగ్రహం కట్టలు తెగింది. మౌలానాను కలకత్తా నుంచి బహిసస్తరించింది. అక్కడి నుంది బెంగాల్ వెళ్లారు. అక్కడ కూడా మౌలానాను బ్రిటీష్ ప్రభుత్వం బహిష్కరించింది. అక్కడి నుంచి బీహార్లోని రాంచిలో తలదాచుకున్నారు. అక్కడ కూడా బ్రిటీషన్లు వేధింపులకు గురిచేశారు. మౌలానాను నిర్భంధించారు. పాతికేళ్ల వయస్సులో 1912లో రాంచీ బెయిుకెళ్లారు. ఇక్కడ భారతదేశంలో అబుల్ కలామ్ అనే వ్యక్తి మనకు వ్యతిరేకంగా రాస్తున్నాడు. అతనికి దీటుగా రాసేవారెవ్వరూ లేరు. తాను చెప్పే విష యానికి ఖుర్ఆన్, హదీసుతో నిరూ పించే ప్రయత్నం చేస్తాడు.
ఇతన్ని ఢీకొనడ మెలాగో పాలుపోవడం లేదు. అందుకే అతన్ని నిర్బంధించాల్సి వచ్చింది అని ఇక్కడి బ్రిటీష్ అధికారి బ్రిటన్లోని విక్టోరియా రాణికి రాసిన లేఖ నేటికీ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఒక్క రోజులో పాతికవేలకు పైగా పత్రికలు ఆకాలంలోనే అచ్చయ్యాయంటే ఎంత గొప్ప విశేషమో.
నిత్యావసరాలను స్వయంగా వెళ్లి చేరవేసేవారు. మౌలానా చనిపోయాక ఎవరింటికీ రేషన్ సరుకు అందక పోవడంతో మౌలాడా ఇంటిముందు జనం వారులు తీరారు. మౌలానా నెలనెలా మినిస్ట్రీ నుంచి వచ్చే జీతాన్ని ఆయా కుటుంబాలకు ఆర్ధిక చేయూతనందిచేవారన్న విషయం అప్పటి వరకూ మౌలానా వ్యక్తిగత కార్యదర్శికి కూడా తెలియదు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పు.. తొట్టతొలిప్రధాని వండిట్ నెహ్రూ కేబినెట్ లో విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. బయటి దేశాల నుంచి విద్యార్థులు ఉన్నత చదువులకోసం మనదేశంలోకి వచ్చి చదువుకునే రోజు కోసం నేను నిరీక్షిస్తున్నాను. అని చెప్పేవారు. దానికోసం కలలు కనేవారు. ఆ కలలను నిజం చేసేందుకు ఎన్నో విద్యా సంస్థలకు బీజం వేశారు. యూని వర్శిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రిక్చర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ రీసెర్చ్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లాంటి ఎన్నో సంస్థలు. మౌలానా మంత్రిగా ఉన్నప్పుడే పురుడుపోను కున్నాయి. ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సైన్సు, బెంగుళూరును అభివృద్ధి పరిచారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్కు అంకురార్పణ చేసి సాంకేతిక విద్యకు పెద్దపీట వేశారు. 1951లో ఖడగ పూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ టెక్నాజీని నుస్థాపించడమూ మౌలానా ఘనతే, చివరి శ్వాస వరకూ దేశంలో విద్యాభివృద్ధి కోసం వృషి చేశారు. 1947 నుంచి 1957 వరకూ మౌలానా విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గవి. రాబోవు తరాల వారికి ఈ సంస్కరణు మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. మౌలానా విద్యారంగానికి చేసిన సేవలకు గాను దేశంలో ఎన్నో విద్యాసంస్థలకు ఆయన నామకరణం చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ భూపాల్, మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్, న్యూఢిల్లీ, మౌలానా అజాద్ నేషనల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భూపాల్, అజార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, న్యూఢిల్లీ, మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, లాంటి విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తుండటం వల్ల ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వం నవంబరు 11న ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్స వంగా జరుగుతుంద ని తేలిపారు.ప్రిన్సిపాల్ కొప్పుల శ్రీధర్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, కౌన్సలర్ అయిషా సిద్దిక్వా, GIO- బాలికల ఇస్లామిక్ సంస్థ, ప్రతినిధులు- అథియా షుగిఫ్తా, డాక్టర్ హఫ్సా యూసుఫ్, తదితరులు పల్గొన్నారు.

Post a Comment