ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలను, హాస్టల్ను సందర్శించిన తిరువీధుల శారద
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలను, హాస్టల్ను సందర్శించిన తిరువీధుల శారద
ఆలిండియా బిసి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు తిరువీధుల శారద ఉయ్యూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలను, హాస్టల్ను సందర్శించడం జరిగింది.
విద్యార్థుల యొక్క పరిస్థితులను, హాస్టల్లో ఆహార పదార్థాలు ఎలా ఉన్నయో ఆమె రుచి చూసి పరిశీలించారు.
ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ హాస్టల్లో, పాఠశాలలో బాత్రూమ్స్ అద్వాన్నంగా ఉన్నాయని కొంచెం వాటిని శుభ్రం చేయించమని హెచ్ఎం కి చెప్పారు. 170 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదని విద్యార్థులు ఆమె దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిషరిస్తానని అన్నారు.

Post a Comment