-->

*కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి*

*కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి*

 *కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి* 

కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయినపల్లి ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా సిబ్బంది బోయినపల్లి 1వ వార్డులో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి ఓ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టింది.

బయటకు వచ్చిన ఆ ఇంటి యజమాని ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెపైన చేయిచేసుకున్నాడు. దీంతో సర్వేకు వెళ్లిన సదరు మహిళ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపి వారి సహాయంతో బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793