-->

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి : జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి : జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్


 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి : జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి ని విక్రయించాలని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్ అన్నారు. శనివారం సుజాతనగర్ మండలంలోని డేగలమడుగు గ్రామంలో ఉన్న గిన్నింగ్ మిల్లులో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన నిల్వ ఉన్నపత్తిలో తేమసేతాన్ని స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతులు వద్ద పత్తి కొనుగోలు  జరగాలని అన్నారు. సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమస్సేతం 8 నుండి 12 మధ్యలో ఉండే విధంగాఉంటాను మార్కెట్కు తీసుకొచ్చేలా రైతులకు సూచించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

మిల్లులోనికి పత్తి ప్రవేశం మొదలు తేమశాతం పరీక్ష పరిశీలన, తూకం, విక్రయం ధర, రైతుల వేలిముద్రలతో కూడిన ఆధార్ అనుసంధానం, ఓటిపి విధానం తదితర అన్ని విషయాల్లో వంటి అవకతవకలకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరగాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎన్ని రోజుల్లో ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాట్సప్ చాట్ యాప్  ద్వారా  వచ్చిన ఫిర్యాదులను రెండు పని దినాల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎం ఎస్ పి ప్రకారం క్వింటాకు 7521 రూపాయలు రైతులకు చెల్లించాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, సీసీఐ కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  పత్తి కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో సీసీఐ అధికారులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి త్రినాథ్ బాబు,జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793