-->

డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

 డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ 

కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్లో గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు.    

 ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి డిజిటల్ లైబ్రరీ ని కొత్తగూడెం బార్ అసోసియేషన్లో ప్రారంభించడం చాలా శుభపరిణామని న్యాయవాదులు డిజిటల్ లైబ్రరీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తమ వృత్తి నైపుణ్యతను మెరుగుపరుచు కోవచ్చునన్నారు. జూనియర్ న్యాయవాదులు సమయం వృధా చేయకుండా రెగ్యులర్గా డిజిటల్ లైబ్రరీలో వచ్చే తీర్పులను చదువుకొని తద్వారా వృత్తిలో మెలకువలను నేర్చుకోవాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గొల్లపూడి భానుమతి, ఏ.సుచరిత కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ఏo.డి.సాదిక్ పాషా, సoదుపట్ల  ప్రవీణ్ కుమార్, దూదిపాల రవికుమార్,పీపీలు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793