పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని, నాగా సీతారాములు
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని, నాగా సీతారాములు
కొత్తగూడెం సుజాతనగర్ మండలం డేగలమడుగులోని జన్నీంగ్ మిల్లులో సీసీఐ ద్వారా ప్రత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుందని, సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రయివేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, సీసీఐ బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలనీ కోరారు.
రైతులు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ క్రమంలో రైతులకు ఎటువంటి నష్టం చేసిన వారి కోసం పోరాటం చేసేందుకు ఎమ్మెల్యే తో పాటుగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటామని సీసీఐ కేంద్ర నిర్వాహకులు నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.

Post a Comment