రూ.14,000 కోట్ల మాల్యా ఆస్తులు బ్యాంకులకు బదిలీ చేశాం: నిర్మలా సీతారామన్
వేర్వేరు బ్యాంకింగ్ స్కాంల కారణంగా నష్టపోయిన బాధితులకు రూ.22,280 కోట్ల పరిహారం ఇవ్వడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పాత్ర పోషించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
విజయ్ మాల్యా కేసులో రూ.14,000 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసినట్టు ఆమె లోక్‌సభలో తెలిపారు. అదేవిధంగా, నీరవ్ మోదీ నుంచి రూ.1052 కోట్లు, హీరా గ్రూప్ నుంచి రూ.226 కోట్లు, మెహుల్ చోక్సీ నుంచి రూ.2565 కోట్లు, రోజ్ వ్యాలీ గ్రూప్ నుంచి రూ.19 కోట్లు, సూర్యా ఫార్మా నుంచి రూ.185 కోట్లు రికవరీ చేయగలిగారని వివరించారు.
ఆర్థిక నేరస్తులు దేశం నుంచి పారిపోయినా వారిని వదిలిపెట్టడం లేదని, న్యాయం కోసం ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Post a Comment