బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య అనారోగ్యంతో మృతి
వరంగల్ జిల్లా: తెలంగాణలో సంచలనం సృష్టించిన "బలగం" చిత్ర క్లైమాక్స్ పాటతో ప్రజల గుండెలను కదిలించిన గాయకుడు మొగిలయ్య ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామంలో మృతి చెందారు.
"బలగం" చిత్రంలో ప్రముఖ దర్శకుడు వేణు యెల్ధండి తెరకెక్కించిన క్లైమాక్స్ పాట "తోడుగా మాతో ఉండి", సినిమాకు గుండెకాయగా నిలిచింది. ఈ పాటను పాడిన మొగిలయ్య-కొంరమ్మ దంపతులు, ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మొగిలయ్య వైద్య ఖర్చుల కోసం చిత్రబృందం, డైరెక్టర్ వేణు యెల్ధండి, అలాగే ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించాయి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలం, నిర్మాణం చేయిస్తామని, వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు.
మొగిలయ్య మరణం పట్ల బలగం చిత్రబృందం, సినీ ప్రముఖులు దర్శకుడు వేణు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Post a Comment