త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో త్వరలో 3,039 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రకటించారు.
అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్, పాల్వాయి హరీష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లా కేంద్రాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల పెరుగుదల
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుండటంతో బస్సులకు డిమాండ్ పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ లింక్ బస్సులను అమలు చేస్తామని తెలిపారు.
ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల
రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం 40,000 మంది మాత్రమే ఉన్నారని మంత్రి తెలిపారు. 15 ఏళ్లు దాటిన పాత బస్సులను స్క్రాప్‌కు పంపించడంతో కొత్త బస్సుల అవసరం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment