బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఎలుకలు దాడి
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ భవానిపై ఎలుకలు దాడి చేశాయి. సరైన వైద్యం అందక, ఆమె కాలు, చేయి చచ్చుబడిపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే స్పందించి, లక్ష్మీ భవానిని మమత హాస్పిటల్‌లో చేర్పించారు. ఆమెకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యపు పనితీరుకు అద్దం పడుతున్నదని పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన వసతులు, నాణ్యమైన భోజనాలను అందించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment