-->

ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలు

 

ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలు

కొత్తగూడెం: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను వెలికి తీసి, వారి ప్రతిభను మెరుగుపరచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు తెలిపారు.

మంగళవారం కొత్తగూడెం డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన క్రీడా పోటీలను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వనజ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి రూ. 364 కోట్ల నిధులు కేటాయించారని వివరించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్పందించాలని నాగా సీతారాములు పిలుపునిచ్చారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793