కొత్తగూడెంలో ఎలక్ట్రికల్ సేఫ్టీపై అవగాహన సదస్సు
కొత్తగూడెం ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎలక్ట్రికల్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్. ఆనంద వేల్, డి.ఎం.ఎస్ (ఎలక్ట్రికల్), సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రికల్ పనులు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఉద్యోగులు ఎస్.ఓ.పి (సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) మరియు ఎస్.ఎం.పి (సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్)లను పాటిస్తూ పని చేయాలని ఆయన సూచించారు. పనిలో ఎలాంటి అజాగ్రత్తలు చోటు చేసుకోకుండా రక్షణా చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రక్షణపరమైన ప్రమాణాలు పాటించడం ద్వారా ఉద్యోగులు తమ సురక్షిత పనిని నిర్వహించడమే కాకుండా తోటి సహచరులకు కూడా రక్షణ కల్పించగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ఏరియా రక్షణ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఏజెంట్ బి. రవీందర్, డీజిఎం (ఈ&ఎం) జే.వి.ఆర్ సి.హెచ్.పి. కే. సోమశేఖర రావు, పిఓ ఎం. శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెం ఏరియాలోని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు మేనేజర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సదస్సు ద్వారా ఎలక్ట్రికల్ పనుల సమర్పణలో భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించబడింది.

Post a Comment