-->

63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి శ్రీకారం

 

63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి శ్రీకారం

రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పరిశీలించారు.

✅ మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం (TGSCO) ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించగా, వాటి నమూనాలను సీఎం పరిశీలించారు. 

✅ ఈ కార్యక్రమంలో మంత్రులు  ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793