పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కాసిపేట: కాసిపేట మండలం పరిధిలోని చిన్న ధర్మారం శివారు అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడి చేపట్టారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 13,220 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పేకాటపై కఠిన చర్యలు కొనసాగిస్తామని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment