-->

పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన గర్భిణి!

 

పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన గర్భిణి!

నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్-2 పరీక్ష సందర్భంగా ఓ అభ్యర్థి పురుటి నొప్పులతోనే పరీక్ష రాయడం విశేషంగా మారింది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణి నాగర్‌కర్నూల్ పట్టణంలో జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష రాసేందుకు హాజరయ్యారు.

పరీక్షా సమయంలోనే ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయం గుర్తించిన పరీక్ష నిర్వాహకులు ఆమెను హాస్పిటల్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆమె మాత్రం పరీక్ష పూర్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ కారణంగా అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆమె పరీక్ష రాయడం కొనసాగించే సమయంలో 108 అంబులెన్స్‌ను పరీక్ష కేంద్రం వద్ద సిద్ధంగా ఉంచారు.

రేవతి భర్త, తల్లి కూడా పరీక్షా కేంద్రం వద్దే ఉన్నారు. అధికారుల ప్రత్యేక ఏర్పాట్ల మధ్య రేవతి తన పరీక్షను పూర్తి చేశారు. ఇది దృఢమైన సంకల్పానికి నిలువుటద్దంగా నిలిచిన ఘటన.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793