అమరేంద్ర బాహుబలికి స్వల్ప గాయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్వల్ప గాయంతో అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన కాలు స్వల్పంగా బెణికినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
వెంటనే చికిత్స అందించిన వైద్యులు ప్రభాస్‌కి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ వార్తతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ శ్రేయస్సు అభిలషిస్తూ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కల్కి 2898 AD' చిత్రం 2025 జనవరి 3న జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్ల కోసం ప్రభాస్ జపాన్ వెళ్ళాలని భావించినప్పటికీ, తాజా గాయంతో ఈ ప్రణాళికలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Post a Comment