అమావాస్య అన్నదానం... మహాభాగ్యం
అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి,
టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. ఆదివారం కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ వద్ద అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదానం చేయడంలో ముందుకు వచ్చిన ప్రముఖులకు వారి కుటుంబసభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరాలని ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, ప్రముఖ వ్యాపారవేత్తలు తాటిపల్లి శంకర్ బాబు, కొదుమూరి శ్రీనివాసరావు, కంబంపాటి రమేష్, గునపాటి ఆనంద్, జీవీ, భద్రం, అనంతం, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, పల్లపోతు శ్రీనివాస్, మహేష్ పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.

Post a Comment