ఎయిడ్స్ వ్యాధి నయం కంటే నివారణ ఉత్తమం
• ఎయిడ్స్ ను పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే ఉంది జిల్లా జడ్జి : జి. భానుమతి.
•హెచ్.ఐ.వి కి వ్యతిరేకంగా పోరాటంలో కలిసి నిలబడదాం డీఎస్పీ : అబ్దుల్ రెహ్మాన్.
• ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ప్రవర్తనలో మార్పు తీసుకోని రావడానికి కృషి డిఎం.హెచ్.ఓ: డా.భాస్కర్ నాయక్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లైంగిక అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హ్యూమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్ (HIV) నుండి తప్పించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.భాస్కర్ నాయక్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ముర్రేడు వాగు బ్రిడ్జి నుండి రైల్వే స్టేషన్ సెంటర్ వరకు ఏర్పాటు చేసిన ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవ ర్యాలీని జిల్లా జడ్జి జి. భానుమతి, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భగా జిల్లా జడ్జి మరియు డిఎస్పీ మాట్లాడుతూ ఎయిడ్స్ ను పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే ఉందని, సురక్షితమైన లైంగిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ బారిన పడకుండా ఉంటామన్నారు.
హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారిలో ధైర్యం నింపడానికి మద్దతు ఇచ్చేందుకు, ప్రజలలో అవగాహన, చైతన్యం కలిగించడానికి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఎయిడ్స్ కు ఇప్పటికి సరైన మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. అనుకోకుండా హెచ్.ఐ.వి వైరస్ బారిన పడినవారు అధైర్య పడకుండా డాక్టరు సలహా మేరకు తగిన మందులు వాడుతూ ఎప్పటిలాగే జీవించవచ్చని సూచించారు.ఈ సంవత్సరం" ప్రపంచ హక్కుల మార్గంలో వెళ్ళండి" అనే థిమ్ తో ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నా మని వివరించారు.
• వ్యాధిగ్రస్తుల ప్రవర్తనలో మార్పు తీసుకోని రావటానికి కృషి డిఎం అండ్ హెచ్.ఓ :భాస్కర్ నాయక్.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ప్రవర్తనలో మార్పు తీసుకోని రావటానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని డిఎం అండ్ హెచ్.ఓ డా.భాస్కర్ నాయక్ పేర్కొన్నారు. జిల్లాలో 2,998 మంది వ్యక్తులు హెచ్ఐవి పాజిటివ్ లుగా ప్రధాన ఆసుపత్రి లో గల ఎ.ఆర్.టి. కేంద్రంలో నమోదు చేయించుకొని ప్రతి నెల క్రమం తప్పకుండ మందులు తీసుకుంటున్నారనీ. ఇందులో అర్హులైన 1,206 మంది ఎ.ఆర్.టి. ఆసరా పెన్షన్ పొందుతున్నారన్నారు
వీరి కోసం జాగృతి, గాడ్ దేరిసా,మహిళా మండలి ,సెక్యూర్ అనే స్వచ్చంద సంస్థలు భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో పనిచేస్తూ, వారి ప్రవర్తనలో మార్పు తీసుకోని రావటానికి కృషి చేస్తున్నాయనీ, వైఆర్.జి.కేర్ లింకు వర్కర్స్ స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతలలో హై రిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తుల కోసం పని చేయటం జరుగుతుందనీ వ్యాధి గ్రస్తులు అపోహలకు తావులేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోని సమాజంలో జీవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఓ డా. కళ్యాణ్, డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్, ఎ ఆర్టి ఎమ్.ఓ తేజస్విని, డిఏం అండ్ హెచ్.ఓ అధికారులు మరియు సిబ్బంది, పలు ఎన్జీఓస్, ఐసీటిసి, పిపిటీసీటి, ఎఆర్టి సిబ్బంది, సిద్ధార్థ నర్సింగ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment