ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు
హైదరాబాద్: ప్రభుత్వ అధికారుల రక్షణ కు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడిన దాడులు చేసిన కఠిన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది,
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను భయభ్రాంతు లకు గురిచేయడమే కాకుండా విధులకు ఆటంకం కలగజేస్తూ దాడులకు దిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది,
ఉద్యోగులను బెదిరించేలా పొలిటికల్ లీడర్లు చేస్తున్న కామెంట్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది,
ఇప్పటికే ఉన్న సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. లగచర్ల, దిలావర్‌పూర్ ఘటనలతో పాటు సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫీసర్లపై దాడి చేసినా, బెదిరించినా రెండేళ్ల పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

Post a Comment