మహదేవ్ పూర్ మండలంలో క్షుద్ర పూజల కలకలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువకులు వాగు ప్రాంతంలో మేకపోతు బలిపూజ చేసిన ఆనవాళ్లను, కొబ్బరికాయలు, అన్నం, బట్టలను చూసి భయాందోళనలకు గురయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించిన ఆందోళన గ్రామస్థుల్లో పెరుగుతోంది. ఇలాంటి పూజలు తమ గ్రామంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామస్థులు అర్ధరాత్రి జరిగే ఇలాంటి భయానక పూజల వల్ల అనుకోని ప్రమాదాలు జరగొచ్చని భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Post a Comment