-->

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంబించిన ఎమ్మెల్యే కూనంనేని

  

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంబించిన ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల ఆర్థిక సాధికారతకు కీలకమని, అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలను బలోపేతం చేయడంలో దోహదపడతాయని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ మద్దతును తెలిపారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793