తెలంగాణలో 200 కొత్త గ్రామ పంచాయతీలు
పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటన చేసే అవకాశం
కొత్త పంచాయతీల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు.
అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో కొత్త పంచాయతీలు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ముందే వీటిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పంచాయతీల జాబితా విడుదల చేసి, పాత పంచాయతీలతోపాటే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నూతన పంచాయతీల కోసం వినతులు
ఎమ్యెల్యేలు, మంత్రులు, ఎంపీలు పంచాయతీ రాజ్ శాఖకు కొత్త పంచాయతీల కోసం తమ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం జనాభా, దూరం, పాలనా అవసరాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సుమారు 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే, తక్కువ జనాభా కారణంగా కొన్ని ప్రతిపాదనలను తిరస్కరించినట్లు సమాచారం.
పాత పంచాయతీలతో కలిసి ఎన్నికలు
కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పంచాయతీల్లో వార్డులు, ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో రాష్ట్రంలో పంచాయతీల మొత్తం సంఖ్య 13,191 కు చేరుకోనుంది.
350 కనీస జనాభా నిబంధనతో సమస్యలు
ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు పంచాయతీలకు దూరంగా ఉండటం వల్ల పాలన సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గూడాలు, తండాలు, అనుబంధ గ్రామాల ప్రజలు కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం గతంలో అభ్యర్థులను డిమాండ్ చేశారు.
350 జనాభా నిబంధన కారణంగా కొన్ని గ్రామాల ప్రతిపాదనలు ఆమోదించలేకపోతున్న ప్రభుత్వం, ఈ నిబంధన సడలించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
అభివృద్ధికి దోహదం
కొత్త పంచాయతీల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ఫండ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇది గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment