సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ పదవీకాలం పొడిగింపు
సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మరో ఏడాది పాటు తన పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బలరాం నాయక్ ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌గా తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల అధిపతిగా పనిచేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన విశేష సేవలందించారు.
డిసెంబర్ 31తో ఆయన ప్రస్తుత పదవీకాలం ముగియనుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం మరో సంవత్సరం పాటు పదవీకాలం పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సిబ్బంది శిక్షణ విభాగం సానుకూల నిర్ణయం తీసుకొని, ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
ఈ నిర్ణయంతో బలరాం నాయక్ సింగరేణి సంస్థలో తన సేవలను కొనసాగిస్తారు.

Post a Comment