శబరిమలలో భారీగా భక్తుల రద్దీ
శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ భారీగా కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతుండగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది.
భక్తులు పంబలోని స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5 గంటలకు పైగా నిరీక్షించి టికెట్లు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయానికి వచ్చిన పెద్ద సంఖ్యలో భక్తులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
కౌంటర్ల సంఖ్య పెంచకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని పలువురు భక్తులు వాపోయారు. దేవస్థానం బోర్డు దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Post a Comment