కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే విరవల్లి శంకర్ దిష్టి బొమ్మను దహనం
కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే విరవల్లి శంకర్ వ్యాఖ్యలు పట్ల నిరసన తెలిజేసిన వేలమ సామాజిక వర్గ సంఘ నాయకులు ఎమ్మెల్యే విరవల్లి శంకర్ దిష్టి బొమ్మ దగ్దం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపూరెడ్డి పల్లి మండలం ఎర్రగుంట సెంటర్ లో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు పట్ల శాసన సభ్యులు, మంత్రులు, అన్ని కుల సంఘ, రాజకీయ నాయకులు ఖండించాలని వెలమ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే విరవల్లి శంకర్ వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని, వెలమ కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే విరవల్లి శంకర్ పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని వెలమ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరవల్లి శంకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో వేముల హరీష్, మామిళ్ళపల్లి రామారావు, ఇమ్మనేని చిరంజీవి, మామిళ్ళపల్లి సుధీర్, ఎదులపల్లి వెంకటేశ్వరరావు, వద్ది వెంకటేష్, జూలపల్లి సాయిబాబా, మామిళ్ళపల్లి రమేష్, జూపల్లి కిరణ్, బోయినపల్లి అవినాష్, పొలకంపల్లి శ్రీనివాస రావు, సన్నేపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment