తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతో ప్రజల మనోభావాలకు దెబ్బ
విగ్రహాలపై కాదు ప్రజా పాలనపై దృష్టి పెట్టాలి
అనవసరంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే బతుకమ్మను లేకుండా చేస్తారా..!?
కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతో ఉద్యమాల ఊపిరిగా సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు దెబ్బ తీసినట్టేనని, విగ్రహాలపై కాదు ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని, విగ్రహాల మార్పుతో అనవసరంగా ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తున్నదని, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే బతుకమ్మను లేకుండా చేస్తారా..!? అని కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విగ్రహాల రూపకల్పనలో మార్పులు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానా అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. విగ్రహాలను మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పే అనేక అంశాలు ఇందులో కనిపించడం లేదని అన్నారు.
కొత్త విగ్రహం కిరీటంతో సహా అసలు డిజైన్‌లో ఉన్న అనేక కీలక లక్షణాలు లేవని, తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు ప్రతీక అయిన కిరీటం తొలగించారని, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే సంప్రదాయ పూల పండుగ బతుకమ్మను లేకుండా చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు భావోద్వేగ, సాంస్కృతిక సున్నితత్వం కలిగించే విగ్రహంలో చేసిన మార్పులను రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారీకి ప్రొఫెసర్ జయశంకర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి దిగ్గజాలు సహకరించారని గుర్తు చేశారు.
ఇలాంటి చర్యల వల్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, ఇది వివాదాన్ని మరింత పెంచుతుందని హెచ్చరించారు. ఈ విగ్రహాన్ని ఎంతో గౌరవంగా ఉంచుకునే తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, ఈ చిహ్నానికి అనవసరమైన మార్పులు జరగకుండా చూడాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు.
విగ్రహాలపై కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. 2006లో ఉద్యమ సమయంలో అన్ని పార్టీలుగా జేఏసీగా ఉన్న నాడే రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్పు చేయడం సొంత ప్రయోజనాల కోసం కొందరు మెప్పుకోసం ఇలా చేయడం తగిన చర్య కాదు పాత విగ్రహన్నే కొనసాగించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Post a Comment