పల్లెపోరుకు సన్నద్ధం బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బీసీ జనాభాను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేసి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. బీసీ కమిషన్ కూడా జిల్లాల వారీగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. సర్వే వివరాలు పూర్తి స్థాయిలో అందిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
నల్లగొండ జిల్లాలో అధికారులు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించి, వాటి మరమ్మతులు, ఆయిలింగ్ పనులను ప్రారంభించారు.
ఓటర్ల జాబితా
జిల్లాలో మొత్తం 868 పంచాయతీలకు సంబంధించి 10,59,263 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 7,392 వార్డుల్లో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మిగిలిన 90 వార్డుల్లో ఓటర్ల జాబితా త్వరలో ప్రకటించనున్నారు.
పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 7,482 వార్డులున్నాయి. స్థానికంగా ఉన్న 3,676 బ్యాలెట్ బాక్సులు సరిపోకపోవడంతో మరో 2,200 బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం వీటిని శుభ్రపరిచి, మరమ్మతులు చేసి సిద్ధం చేస్తున్నారు.
ఈసారి పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత: నల్లగొండ డివిజన్, రెండవ విడత: మిర్యాలగూడ డివిజన్, మూడవ విడత: దేవరకొండ డివిజన్
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాస్థాయి అధికారులు పూర్తి స్థాయి ప్రణాళికను అమలు చేస్తారు. నోడల్ అధికారుల గుర్తింపు, ఎన్నికల సిబ్బందిని కేటాయించే ప్రక్రియ వేగవంతమైంది.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడం, నోడల్ అధికారుల గుర్తింపు కొనసాగుతోంది.
ఈ ఎన్నికలు బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు మార్గదర్శకంగా నిలుస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment