-->

సహనం కోల్పోయాను, నేను మాట్లాడింది పొరపాటే: సీపీ సీవీ ఆనంద్

 

సహనం కోల్పోయాను, నేను మాట్లాడింది పొరపాటే: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన వ్యాఖ్యలపై జాతీయ మీడియాకు క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటుగా జరిగాయని, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

సంధ్య థియేటర్ ఘటనపై జరిగిన మీడియా సమావేశంలో జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ సీపీ సీవీ ఆనంద్ కొంత అసహనంతో వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో సంఘటనకు సంబంధించిన వీడియోలను విడుదల చేసి, వివరాలు అందించారు.

ఈ సందర్భంలో, జాతీయ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, తాను మాట్లాడింది పొరపాటేనని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకలేదని స్పష్టం చేస్తూ క్షమాపణలు కోరారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793