సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ సొసైటీ ఎన్నికల్లో TBGKS అభ్యర్థి విజయకేతనం*
సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ సొసైటీ ఎన్నికల్లో TBGKS అభ్యర్థి విజయకేతనం*
- *వేముల శైలేష్ కిరణ్ డైరెక్టర్ గా ఎన్నిక*
- *విజేత ను అభినందించిన ఎంపీ వద్దిరాజు*
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్రల్ వర్క్ షాప్ నందు ఈ రోజు జరిగిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అభ్యర్థి వేముల శైలేష్ కిరణ్ 59 ఓట్లకు గాను 49 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో తొలి స్థానంలో నిలిచారు. ఆయన విజయంతో గులాబీ జెండా సెంట్రల్ వర్క్ షాప్ వద్ద ఎగరేసింది.
విజయం సాధించిన వేముల శైలేష్ కిరణ్‌కు రాష్ట్ర చీప్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం, సెంట్రల్ కమిటీ మెంబర్స్ విజయ్ కుమార్, కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఫిట్ సెక్రటరీ సూరజ్, బ్రాంచ్ సెక్రటరీ శివకుమార్, అమరేందర్, అశోక్, విజయ భాస్కర్, అరుణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ విజయం తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం భవిష్యత్తుకు మరింత మద్దతు చేకూర్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. జై తెలంగాణా! జై జై తెలంగాణా!
Post a Comment