సొసైటీ ఎన్నికల్లో TBGKS అభ్యర్థి విజయకేతనం అభినందించిన కాపు సీతాలక్ష్మి
- *వేముల శైలేష్ కిరణ్ డైరెక్టర్ గా ఎన్నిక*
- *విజేతను అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
కొత్తగూడెం, సింగరేణికి చెందిన కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్రల్ వర్క్ షాప్ ఉద్యోగుల సహకార పొదుపు సంఘం ఎన్నికలు సోమవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) అభ్యర్థిగా వేముల శైలేష్ కిరణ్ పోటీలో నిలిచారు. అందరి అంచనాలకు మించి ఎన్నికల్లో TBGKS అభ్యర్థి అత్యధిక మెజార్టీతో సొసైటీ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు.
వర్క్ షాప్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ గా ఎన్నికై గులాబీ జెండాను రెపరెపలాడించిన శైలేష్ కిరణ్ ను మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అభినందించారు. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వారికి సొసైటీ ద్వారా మెరుగైన సేవలు అందించాలని కాపు సీతాలక్ష్మి కోరారు.

Post a Comment