-->

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన తిరువీధుల శారద

 

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన తిరువీధుల శారద

మచిలీపట్నం: ఆలిండియా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు తిరువీధుల శారద మచిలీపట్నంలో జరిగిన అమానవీయ సంఘటనపై స్పందించారు. మొన్న రాత్రి మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనను తెలుసుకొని, ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు.

ఈ సందర్భంగా, బాధిత బాలిక కుటుంబ సభ్యులను మనోధైర్యం కల్పించారు. నిందితులను పీడీ యాక్ట్ మరియు ఫోక్సో చట్టం కింద శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793