ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కాగాజ్ నగర్ మండల నూతన కమిటీ ఎన్నిక
ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కాగాజ్ నగర్ మండల నూతన కమిటీ ఎన్నిక
కొమురం భీం జిల్లా కాగాజ్ నగర్ మండల కేంద్రంలోని ఇస్గం శివ మల్లన్న గుడి ప్రాంగణంలో ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కాగాజ్ నగర్ మండల నూతన కమిటీ ఏర్పాటు జరిగింది.
రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు డబ్బ బాపు సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.
మండల నూతన కార్యవర్గం:
మండల అధ్యక్షులు: చింతపూడి పోషన్న
ఉపాధ్యక్షులు: కన్నెపేల్లి విరేష్, అన్నం గణపతి
ప్రధాన కార్యదర్శి: టేకం బాపురావు
ప్రచార కార్యదర్శులు: బుర్రి తిరుపతి, చికినం సాయి
సహాయక కార్యదర్శులు: మండిగా శ్రీనివాస్, మండిగా మొండి
సంయుక్త కార్యదర్శులు: టేకం బాపురావు, బుర్స శంకర్
సాంస్కృతిక కార్యదర్శులు: అటి పుల్లయ్య, పెద్దల పెంటమ్మ
కోశాధికారి: ఉరడి గంగారాం
కార్యవర్గ సభ్యులు: డుబ్బుల శంకర్, ఎట్యాల శంకర్, టేకం రాములు, ముసరపు చీకటి, టేకం బాపు మొదలైనవారు.
రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య మాట్లాడుతూ, నూతన కమిటీ ఆదివాసీ సమాజ అభివృద్ధి, హక్కుల కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ ప్రముఖులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment