బ్లాక్ బెల్ట్ 3rd డాన్ సాధించిన అహ్మద్ ఖాన్
రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్‌లలో పతకాలు సాధించి షాద్‌నగర్ ఘనత చాటిన అహ్మద్ ఖాన్
రంగారెడ్డి జిల్లా, డిసెంబర్: నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు అహ్మద్ ఖాన్, కుంగ్‌ఫూ, కరాటే ఆటలలో సాధించిన విజయాలతో షాద్‌నగర్‌ను జాతీయస్థాయిలో గర్వకారణంగా నిలబెట్టాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అమానుల్లా ఖాన్ దంపతుల నాలుగో కుమారుడైన అహ్మద్ ఖాన్ చిన్నప్పటి నుంచే ఈ క్రిడలపై ఆసక్తి చూపించేవాడు.
రోజూ షాద్‌నగర్‌కు ప్రయాణించి బాలరాజ్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్న అతను క్రమంగా జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్‌లలో పాల్గొని అనేక పతకాలు, ట్రోఫీలను సాధించాడు.
తన మాస్టర్ బాలరాజ్ సహకారంతో "న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ" స్థాపించి పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, స్కూల్ విద్యార్థులకు కుంగ్‌ఫూ శిక్షణ అందిస్తున్నారు. అహ్మద్ ఖాన్ తన శిక్షణ ద్వారా పలు టోర్నమెంట్‌లకు కొత్త ఆటగాళ్లను సిద్దం చేస్తూ షాద్‌నగర్‌కు మరెన్నో విజయాలు తెచ్చిపెడుతున్నాడు.
తాజాగా, కుంగ్‌ఫూ లో తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటూ బ్లాక్ బెల్ట్ 3rd డాన్ సాధించి ట్రోఫీ, సర్టిఫికేట్ కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వాలు అహ్మద్ ఖాన్‌ను గుర్తించి సహాయం అందిస్తే, షాద్‌నగర్‌ను అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణంగా నిలబెట్టడం పెద్ద కష్టం కాదు.

Post a Comment