జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం
జగిత్యాల జిల్లా : మెట్‌పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్ద కుక్క మృతిచెందడం, దాన్ని ఏదో జంతువు పీక్కుతినడం ఆదివారం సాయంత్రం గ్రామస్థుల దృష్టికి వచ్చింది.
గ్రామస్తుల కథనం ప్రకారం, చిరుతపులి శివారులో సంచరించి శునకంపై దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ సమాచారంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకాన్ని పరిశీలించారు. చిరుత కాలి ముద్రలు సమీపంలో కనిపించటంతో వాటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక:
కాలి ముద్రలను బట్టి చిరుతపులి సంచారం స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ప్రస్తుతం చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గ్రామ ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment