-->

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు బయల్దేరిన క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు బయల్దేరిన క్రీడాకారులు


అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

కొత్తగూడెం: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో సత్తా చాటి జిల్లా పేరు ప్రఖ్యాతులు పెంచాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు తెలిపారు. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయిలో పోటీలకు హైదరాబాదు వెళ్తున్న క్రీడాకారులకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, డివైఎస్ఓ పరంధామరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, వై. వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, "జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణం. డిసెంబర్ 29 వరకు హైదరాబాదులో నిర్వహించనున్న ఈ పోటీలలో ప్రాతినిధ్యం వహించడం మీకు గొప్ప అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అండగా ఉంటారని" తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793