డైరెక్టర్ "పా" ను కలసి వినతి పత్రం ఇచ్చిన HMS నాయకులు
సింగరేణి డైరెక్టర్ "పా" ను కలసి డంపర్ ఆపరేటర్‌ల సమస్యలపై వినతి పత్రం అందజేసిన HMS రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ వై. ఆంజనేయులు.
ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, సింగరేణి డంపర్ ఆపరేటర్లకు సి గ్రేడ్ మరియు డి గ్రేడ్ ఈక్విప్‌మెంట్ అందుబాటులో లేకపోవడం, ఏ గ్రేడ్ మరియు బి గ్రేడ్ ఈక్విప్‌మెంట్ మాత్రమే ఉండడం కార్మికులకు సమస్యలు కలిగిస్తోందని తెలిపారు. జెబిసిసిఐ నిబంధనల ప్రకారం, ఏ గ్రేడ్ ఈక్విప్‌మెంట్ కలిగిన వారికి ఏ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే బి గ్రేడ్ వారికి కూడా ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, సింగరేణి అధికారులు ప్రమోషన్‌ల కోసం కార్మికులను అనవసరమైన టెస్టుల ద్వారా శ్రమ పెట్టించడం అన్యాయమని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
ఈ సమస్యను ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని, సానుకూల స్పందన లభించిందని రియాజ్ అహ్మద్ తెలిపారు. డైరెక్టర్ "పా" కూడా డంపర్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, వై. ఆంజనేయులు, మొహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్, సారయ్య, టి. రాజేశ్వరరావు, రాకేష్ మండల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment