-->

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియాన్ ఆత్మీయ సమావేశం

 

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియాన్ ఆత్మీయ సమావేశం

డిజిటల్ మీడియా సామాన్యుల స్వరం: చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం కొత్తగూడెంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్ట్ మల్లెబోయిన లింగయ్య అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపెల్లి ముతేష్, జాతీయ గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు కే. రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిజిటల్ మీడియా సామాన్యుల గొంతుకగా పనిచేస్తుందని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పత్రికా రంగంలో అనుభవం ఉన్న అనేక మంది ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా పనిచేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు.

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత అవసరం
డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని డిమాండ్ చేశారు.

ఐక్యంగా ఉద్యమించాలి
డిజిటల్ మీడియా జర్నలిస్టులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మల్లెబోయిన లింగయ్య, రామ నరసింహ, చాంద్, మజీద్, సతీష్, రాంరెడ్డి, బి. నాగేశ్వరరావు, టి. దేవేందర్, సిహెచ్. మోహన్, రాందాసు, రబ్బాని, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793