-->

25వ వార్డులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు

 

కౌన్సిలర్ దంపతులను సన్మానించిన పారిశుద్ధ్య కార్మికులు

భద్రాద్రి కోతగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ సాహెర బేగం, మాజీ కౌన్సిలర్ మొహ్మద్ యూసుఫ్, మరియు శానిటేషన్ వర్కర్‌లు సులోచన, చిరంజీవి, కృష్ణ, రాజవ్వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.

కోతగూడెం నియోజకవర్గ ప్రజలు, పారుశుద్య కార్మికులు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 

నూతన సంవత్సరంలో సిపిఐ పార్టీ బలోపేతానికి జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెం ప్రజలకు అన్ని విధాలా మంచి జరుగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దంపతులను ఘనంగా సన్మానించిన శానిటేషన్ వర్కర్లు సులోచన, చిరంజీవి, కృష్ణ, రాజవ్వ.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793