భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన ఆత్మహత్య చేసుకున్న దంపతులు
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు జీవనాధారంగా వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12) ఉన్నారు.
గ్రామంలో కొంతమంది మహిళలను సమూహంగా ఏర్పరచి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు రుణాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం ద్వారా రూ.2.50 లక్షల రుణం తీసుకున్నారు. దీనికి వారానికి రూ.200 కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య
ప్రారంభంలో కిస్తీలు సక్రమంగా చెల్లించినా, కుటుంబంలో అనారోగ్య సమస్యల కారణంగా చందన కిస్తీలను కట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఈ ఒత్తిడి కారణంగా డిసెంబరు 6న చందన గడ్డి మందు తాగగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆమె భర్త దేవేందర్ డిసెంబరు 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చికిత్స పొందుతున్న చందన కూడా మంగళవారం ఆసుపత్రిలో మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం? ఇద్దరు పిల్లలను అనాథలుగా మిగిల్చిన ఈ ఘటన ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లపై చర్చ

Post a Comment