-->

సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు

 

సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు

సదాశివపేట: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నూతన సంవత్సర 2025 సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం తాజుద్దీన్ కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడుతూ, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని, కులమతాలకు అతీతంగా సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలని, సమాజంలో అందరికీ మంచిది జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షఫీ, AITUC నాయకులు శంకరప్ప, మగ్దుమ్ నగర్ ఇంచార్జ్ సాదిక్ అలి, రైతు సంఘం నాయకులు కె. విష్ణువర్ధన్ రెడ్డి, ముస్తఫా, ఎండి బషీర్, టీ. ప్రభాకర్, ఎండి గౌస్, లింగం యాదవ్ పాల్గొన్నారు.

మహిళా నాయకులుగా సిపిఐ శ్రామిక మహిళా నాయకురాలు అనసుజ, ఉద్యమ మహిళా సమాఖ్య నాయకురాలు ఆర్. లక్ష్మి, దేవి బాయ్, బిపాషా, శంకరమ్మ, రజిని, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సామూహిక సోదరభావంతో విజయవంతంగా జరిగింది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793