-->

న్యాయవాదుల నైపుణ్య అభివృద్ధిపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపు

న్యాయవాదుల నైపుణ్య అభివృద్ధిపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపు


భద్రాద్రి కొత్తగూడెం: యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని, సమాజానికి ఆదర్శప్రాయంగా మంచి న్యాయసేవలు అందించాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వసంత్ అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, న్యాయమూర్తుల ఖాళీ స్థానాలు భర్తీ చేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి. భానుమతి, బి. రామారావు, ఏ. చిచరిత, కే. సాయి శ్రీ, టి. శివ నాయక్, చంద్రికా రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ న్యాయవాదులు పివిడి లక్ష్మి, విశ్వశాంతి, లావణ్యతో పాటు బార్ కార్యవర్గ సభ్యులు తోట మల్లేశ్వరరావు, ఎంఎస్‌ఆర్ రవిచంద్ర, సాదిక్ పాషా, నల్లమల ప్రతిభ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం న్యాయవాద వృత్తి పురోగతికి, సమాజానికి న్యాయసేవల వృద్ధికి ప్రేరణగా నిలిచిందని వక్తలు అభిప్రాయపడ్డారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793