-->

KTPS TRVKS ప్రాంతీయ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

KTPS TRVKS ప్రాంతీయ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) H-58 రికగ్నైజ్డ్ యూనియన్ ఆధ్వర్యంలో 2025 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా KTPS TRVKS ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ (KTPS 5&6, KTPS 7వ దశ మరియు CE /CETD) కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అదేవిధంగా సూపరింటెండింగ్ ఇంజినీర్లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో KTPS కాంప్లెక్స్‌కు చెందిన రాష్ట్ర, జన్కో, రెండు రీజియన్స్ నాయకులు, బ్రాంచ్ నాయకులు, ఆర్టిజన్స్ నాయకులు, BTPS, YTPS రీజియన్స్ నాయకులు మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793