భీమన్న దేవార జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి పెద్దల సంతోష్
కొమురం భీం జిల్లా, బెజ్జూర్: ఆదివాసీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఆదివాసీ భీమన్న దేవార జెండాలను మండలంలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం బెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల సంతోష్ మాట్లాడుతూ, జనవరి 8న 23వ భీమన్న దేవార జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా, ఆదివాసీ కొలవార్ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మన ఆదివాసీ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ పండుగలో ఆదివాసీ కొలవార్ ఆడపడుచు లక్ష్మి దేవారను లేపి ఊరేగించి, ఆటపట నిర్వహించడం మన సంస్కృతి రక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అత్రం భక్కయ, ఇంజిరి రాజారాం, మండల గౌరవ అధ్యక్షులు మల్లేష్, యువజన అధ్యక్షులు వెంకటేష్, యువజన ప్రధాన కార్యదర్శి గణేష్, సంస్కృతి కార్యదర్శి సండ్ర మల్లేష్, శంకర్, శక్కరం, కోరేత తిరుపతి, జిల్లా అధ్యక్షురాలు పొర్తేటి శ్రీదేవి, అమృత, పద్మ, మమత, ఇతర పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
అందరూ కలిసి భీమన్న దేవార జెండా పండుగను విజయవంతంగా జరపడానికి కృషి చేయాలని, ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.

Post a Comment