కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం
భద్రాద్రి జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ఆదేశాల మేరకు కొత్తగూడెం మున్సిపాలిటీనీ కార్పొరేషన్ గా ప్రకటించి కొత్తగూడెం 36 వార్డులు, పాల్వంచ 24 వార్డులు, సుజాతనగర్ 7 గ్రామ పంచాయతీ లతో కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ఫోటోకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమం 22వ వార్డు యాకూబ్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఇందులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్, వార్డు సెక్రటరీ ఎండి ఇర్ఫాన్ అలీ, వార్డు మహిళా సంఘ సభ్యురాలు షమీం, అజ్జు, అక్రమ్ పాషా, అబ్దుల్ సలాం, మురాద్ భాయ్, జహీర్, సబుధర్ భాయ్, మహబూబ్, అంతరపు కృష్ణతో పాటు మహిళా కార్యకర్తలు మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నాయకులు గౌరవ శాసనసభ్యుల సేవలను కొనియాడి, వారి కృషిని ప్రశంసించారు.

Post a Comment