-->

జెఐహెచ్ ఖిల్లా శాఖ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

 

జెఐహెచ్ ఖిల్లా శాఖ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

ఖమ్మం, జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం ఖిల్లా శాఖ మహిళా విభాగం ఆదివారం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో జెఐహెచ్ ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్ మాట్లాడుతూ, "మానవ సేవలోనే మాధవ సేవ దాగి ఉంది. ప్రతి ఒక్కరూ పరుల సేవకు పాటుపడాలి. మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు," అని తెలిపారు.

చలికాలం నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు ఈ దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు నస్రీన్, హజీరా, సుమయ్య, సీమ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793